అంశము : వికీపీడియా పరిచయం

పాఠ్య లక్ష్యం: వికీపీడియా, ఒక బహుభాషా, అంతర్జాల (వెబ్) ఆధారిత, ఎవరైనా వ్రాయగలిగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. వికీపీడియా లో రకరకాల అంశాల గురించి చదువుకోవచ్చు. అలాగే మనకి మంచి భాష, విషయ పరిజ్ఞానం వున్నపుడు వ్రాయవచ్చు కూడా. అలా వ్రాయాలనుకొనే ఔత్సాహికులకు వికీపీడియా వెబ్ లే ఔట్ ని పరిచయం చెయ్యటం, కొన్ని విధానాలను, నియమాలపై అవగాహన కలిగించటం ఈ మాడ్యూల్ ఉద్దేశం.

ఈ పాఠము లో -

1. వికీపీడియా పరిచయం - పాఠ్యము, వికీపీడియా చరిత్ర, 5 మూల స్తంభాలు, వికీపీడియాకు మీరు ఎలా తోడ్పడగలరు - 15 నిమిషములు

2. వికీపీడియా వెబ్ లే ఔట్ పరిచయం - వీడియో, తెలుగు వికీపీడియా లో మొదటి పేజీ, అందులో వున్నవివిధ పేజీ లింకులు, వాటిలో నేర్చుకో గల అంశములు - 7:19 నిమిషములు
3. తరచుగా అడిగే ప్రశ్నలు - 5 నిమిషములు
4. అభ్యాసము - పాఠ్యము చదివి, వీడియో చూసిన తరువాత ఈ అసైన్మెంటుని పూర్తి చెయ్యండి - 10 నిమిషములు.

అభ్యాస ఫలితం : వికీపీడియా గురించి అవగాహన పొంది, వెబ్ సైట్ లో వివిధ పేజీలలో విహరించగలరు.

alt-text-here

వికీపీడియా, ఒక బహుభాషా, అంతర్జాల (వెబ్) - ఆధారిత,ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము ఇక్కడ సమాచారం గురించి తెలుసుకోవటమే కాదు, ఉన్న సమాచారం లో అవసరమైన మార్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్నికూడా చేర్చవచ్చు.

alt-text-here

alt-text-here

అందరికీ అన్నీ విషయాలు తెలియక పోవచ్చు, కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం పై కొంత విషయ జ్ఞానం కలిగి ఉంటారు . అలా అందరికీ తెలిసిన విశేష జ్ఞానమును ఒక చోట చేర్చటం వలన విజ్ఞాన సర్వస్వం తయారవుతుంది. అలా కూర్పు చేయబడిన విజ్ఞానసర్వస్వం ఉచితం గా, స్వేచ్చగా అందించటమే వికిపీడియా లక్ష్యం.

alt-text-here

alt-text-here

వికీపీడియా 285+ భాషలలో !

alt-text-here

alt-text-here

alt-text-here

alt-text-here

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం.

వికీపీడియా ఒక తటస్థ దృక్కోణం నుండి వ్రాయబడింది

వికీపీడియా ఉచిత కంటెంట్ ను ఎవరైనా ఉపయోగించవచ్చు, సవరించవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు

వికీపీడియా సంపాదకులు పరస్పరం గౌరవంతో, నాగరికతతో వ్యవహరించాలి

వికీపీడియాకు స్థిరమైన నియమములు లేవు

వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు,
ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు

మౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. తేలికగా చెప్పాలంటే, వికీపీడియా మూల ఆలోచనలు చేర్చుటకు తగిన స్థలం కాదు. ఇతరులు విషయాన్ని గురించి విశ్వసనీయమైన మూలాలలో పేర్కొన్న వాటిని సంగ్రహం రూపంగా వికీపీడియా లో వ్రాయలి. వ్యాసాలలో కొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు మరియు ఇప్పటికే ముద్రించిన వివరాలను కలపడం మరియు విశ్లేషణం ఆధారంగా మూలవనరులు చెప్పేసారాంశం కంటే విస్తరిత సారాంశానికి చేరువయ్యేటట్లు రాయకూడదు.మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం సమాచారాన్ని సూచించడానికి నమ్మకమైన వనరులను ఉపయోగించడం

రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు.తటస్థ దృక్కోణం వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయాలి. ఏపక్షం ప్రధానంగా భావించక, పక్షపాతం లేకుండా మరియు ఖచ్చితమైన విశ్వసనీయమైన మూలాలు ఆధారంగా విషయం పై అన్ని దృక్కోణాలు వివరించాలి. పిడివాదనలు లేక ఒక దృక్కోణాన్ని సమర్థించేలా వ్రాయడం వికీపీడియా వ్యాసాల్లో ఉండదు. తటస్థ దృక్కోణంతో ఉండటమే తెవికీ వ్యాసాల ప్రత్యేకత !

రచనలు కాదు, రచనల "గురించి వ్రాయండి"'

వికీలో వ్యాసము ప్రసిద్ధ మైనది లేదా ముఖ్య విషయమై ఉండాలి ఇందుకోసం ప్రాముఖ్యత కలిగిన స్వతంత్ర మూలాల నుండి తీసుకొనాలి మీరు వాడే వనరుల సమాచారాన్ని వ్యాసంలో పేర్కొనాలి. అలాఅయితే ఇతరులు వాటిని తనిఖీ చేసుకోగలుగుతారు. నిజనిర్ధారణకు పేరు ప్రతిష్టలు కలిగిన అయిన మూడవ పక్షం వనరులు అనగా విద్యా విషయాల ముద్రణలు, సహపరిశోధకులచే సమీక్షింపబడిన విద్యావిషయక పత్రికలు, జాతీయ అంతర్జాతీయ పత్రికలు, ప్రాధాన్యమున్న దృక్కోణాలన్నిటిని ప్రచురించే వనరులను వాడితే మంచిది. ఎప్పుడో ఒక విషయాన్ని ప్రచురించే లేక అంచులలోవున్న వనరులను వాడవద్దు, విషయం గురించి ఉన్నత నాణ్యతగల మరియు విశ్వసనీయమైన వనరుల కోసం అన్వేషించండి.

వైరుధ్యాసక్తులు

మీరు పనిచేయుచున్న సంస్థలేక మీకు ఉపాధి కల్పించిన వారి గురించిన విషయాలపై మీకు వైరుధ్యాసక్తులున్నప్పుడు, వాటి గురించి వ్యాసాలను వ్రాయవద్దు.

alt-text-here

మంచి వికీ ఆర్టికల్ లో గద్యం స్పష్టంగా, సంక్షిప్తంగా చదువరులకు అర్థమయ్యేవిధంగా సరైన స్పెల్లింగ్ మరియు వ్యాకరణం దోషాలు లేకుండా , ఉదాహరణలు చిత్రములతో, విశ్వసనీయ మూలాలను కలిగి ఉంటాయి

అధిక నాణ్యత రచనలు ఈ లక్షణాలు కలిగి వుంటాయి:

ఏది వికీపీడియా కాదు

alt-text-here

alt-text-here

వికీడేటా – అనేది మానవులు మరియు యంత్రాలు కూడా చదవగల మరియు

సంకలనం చేయగల ఒక ఉచిత సహకార, బహుభాషా, ద్వితీయ డేటాబేస్ ఓపెన్ నాలెడ్జ్ బేస్. నిర్మాణాత్మకమైన డేటాకు కేంద్ర నిల్వగా వ్యవహరిస్తుంది ఇది వికీమీడియా కామన్స్ మీడియా ఫైళ్ళకు నిల్వ ప్రాజెక్టులాగా అన్ని వికీమీడియా ప్రాజెక్టుల కోసం జ్ఞాన భాండాగారం.

వికీ బుక్స్ – ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి పుస్తకాల నెలవు – మనకు ఉచితంగా అందుబాటులో ఉన్న పుస్తకాలను ఇక్కడ చేర్చవచ్చు .

వికిసోర్స్ – ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు మూలరూపాల సమాహారం – మనం నిత్యం చదువుకునే ఏ స్మృతి-శృతి సంహిత అయినా, మన శతకకారులు రచించిన శతకములు, వేద-వేదాంగాలు, పురాణ-ఇతిహాసాలు ఇక్కడ వాటి మూల రూపంలో పొందుపరుచవచ్చు.

alt-text-here

వికిస్పిషీస్ః జీవరాశుల సమాచార – మన జీవ శాస్త్రం అన్ని రకాల జీవ-వృక్ష-జంతువులను ఒక ప్రణాళికననుసరించి క్రమబద్ధీకరించి విభజించింది. ఆయా జీవాల విభజన సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

వికీమీడియా కామన్స్ః – ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాల మరియు చలనచిత్రాల సంకలనం – ఇక్కడ మీరు అందరితో పంచుకునే విధంగా ఎటువంటి కాపీరైటులేని క్రియేటివ్ కామన్స్ మరియు ఇతర సంబంధిత లైసెన్స్ లలో అనేక చిత్రాలు(ఫోటోలు) పెట్టుకోవచ్చు.

మీడియావిక – వికి లాంటి గూడును మీరూ చేస్కోవాలంటే ఇది ఒక అచ్చులా వాడుకోవచ్చుఇది GNU/GPL లైసెన్సు కింద ఉచితంగా లభ్యమౌతుంది. దీన్నే అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా వాడుతున్నాయి. దీన్ని మొదటగా ఉచిత విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ను నిర్మించడానికి అభివృద్ధి చేశారు

కొత్తగా చేరిన నాలాంటి ఔత్సాహికులు ఏమి చేయవచ్చు

alt-text-here

ముందుగా వికీపీడియా సాండ్ బాక్స్ లో మీ ఖాతా తెరవండి


https://tewiki.iiit.ac.in

ఇది వికీపీడియాలో రాయబోయే ముందు అబ్యాసం కోసం తయారుచేయబడిన సైటు
ఇందులో మొదట మీరు రాయాలి అనుకొంటున్న వ్యాసాన్ని మొదట వికీ లో ఉందో లేదో వెతకండి, ఒకవేళ ఉంటే ఉన్న వ్వాసాన్ని అప్డేట్ చేయండి, లేకపొతే కొత్త వ్యాసంసృష్టించండి.

alt-text-here

alt-text-here

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. ప్రతీ సందేహానికి పుస్తకాలు కొని వెతకాలన్నా,కొన్ని కోట్ల పేజీలు వున్న ఇంటర్నెట్ లో సమగ్రం గా వెతకాలి అన్నా , ఎవరినైనా అడగాలన్నా చాలా సమయం పడుతుంది. ఇది ఒకోసారి సాధ్యంకాకపోవచ్చు. కాని నిమిషాల్లో వీకీపీడియా ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అది కూడా మన మాతృభాష తెలుగులో.

మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, పద్యాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. వికీపీడియాలోని సమాచారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు , వ్యాపార ప్రయోజనాలకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు

నాది మీది అందరిదీ

ఇంత శ్రమపడి, అష్టకష్టాలు పడి తయారుచేసేది, ఊరికినే ఎవరికిబడితే వాళ్ళకు ఇచ్చెయ్యడానికేనా?

ఎన్నో పుస్తకాలు చదివి, ఆకళింపు చేసుకొన్నవిషయాలను, వాటి మూలల కోసం శ్రమపడి, వెతికి సంకలనము చేసిన వ్యాసము ఊరికినే ఎవరికైనా ఇయ్యటానికేనా ?

అవును, సరిగ్గా అందుకే!! లోకం లో లభించు విజ్ఞానాన్ని అంతా ప్రజలందరికీ ఉచితంగా అందించాలనే సదాశయంతో వికీపీడియా మొదలయింది. ఈ ఆలోచనే

alt-text-here

1. వికీ అంటే ఏమిటి?

వికీ అనేది ఒకదానికొకటి అనుబంధమున్న వెబ్‌ పేజీల సమూహం . వీటన్నిటినీ ఎవరైనా, ఎప్పుడైనా చూడ వచ్చు, మార్పు చేర్పులు చెయ్యవచ్చు.(Collaborative software). ఇది ఆసక్తికరంగానూ, సరదాగానూ అనిపిస్తోంది. కానీ, దీని వలన సమాచారానికి భద్రత కరవై, తప్పులతో కూడి పనికిరాకుండా పోవచ్చు. వార్డ్‌ కన్నింగ్‌హామ్‌ ఈ భావాన్నీ, సాఫ్ట్‌వేర్‌ ను కనుక్కున్నారు. ఈ పేజీలో పైనున్న "మార్చు" అనే లింకును నొక్కి, ఈ పేజీని సైతం దిద్దుబాటు చెయ్యవచ్చు లెదా కుడి పక్కనున్న "[edit]" అనే లింకును నొక్కి ఏదో ఒక విభాగాన్ని మాత్రమే దిద్దుబాటు చెయ్యవచ్చు! ఈ పేజీలో మార్పులు చేర్పులు చెయ్యటానికి మీకేమీ కనిపించకపోతే, అసలిది ఎలా పనిచేస్తుందో చూడాటానికి ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి.

2. వికీపీడియా అంటే ఏమిటి?

వికీపీడియా అనేది ఒక సమగ్రమైన, ఉచితంగా లభించే కొత్త తరహా విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేసే ఒక పథకం. మరింత సమాచారం కొరకు వికీపీడియా:గురించి మరియు వికీపీడియా:వికీపీడియా లను చూడండి

3. దీన్ని వికీపీడియా అని ఎందుకంటారు?

వికీపీడియా అనేది "వికి" మరియు "ఎన్‌సైక్లోపీడియా" అనే పదాల కలయిక తో పుట్టిన పదం.

4. వికీపీడియా లక్ష్యం ఏమిటి?

విస్తృతి లోనూ, లోతు లోను కూడ అత్యంత పెద్దదైన ఒక ఉచిత, నమ్మదగ్గ విజ్ఞాన సర్వస్వాన్ని— తయారుచెయ్యడమే. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు!

5. వికీపీడియా ఎవరిది?

వికీపీడియాని మాతృ సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. వికీపీడియా సోదర ప్రాజెచ్టులైన విక్షనరీ (వికి నిఘంటువు), వికీబుక్స్‌ (ఉచిత పాఠ్యపుస్తకాలు), మొదలైన వాటితో పాటు, సంబంధిత డోమైన్‌ పేరులను కూడా కలిగివుంది. ఇదివరలో, ఈ సైటును జిమ్మీ వేల్స్‌ కు చెందిన బొమిస్‌ Inc అనే కంపెనీ సర్వర్లలో వుండేది. ఈ కంపెనీ ప్రస్తుతం సిటు యొక్క ఖర్చుల్లో కొంత భాగాన్ని భరిస్తోంది. వికీమీడియా ఫౌండేషన్‌ ను జూన్‌ 20, 2003 లో ఏర్పాటు చేసిన తరువాత డొమైన్‌ పేర్లూ, సంకేతిక పరికరాలు ఫౌండేషన్‌ కు బదిలీ అయ్యాయి. జిమ్మీ వేల్స్‌ ప్రవచించిన సిధ్ధాంతాల మార్గదర్శకత్వంలో వికీపీడియనుల సముదాయం ప్రస్తుతం ఈ సైటును నిర్వహిస్తున్నది. నిష్పాక్షిక దృక్పథం ఒక ఉదాహరణ.

ఈ సైటులో ప్రచురించిన వ్యాసాలన్నీ ఆయా రచయితలు GNU Free Documentation License కు లోబడి వెలువరిస్తారు, కాబట్టి ఈ వ్యాసాలన్నీ ఉచితం. వీటిని ఆ లైసెన్సుకు లోబడి ఉచితంగా వాడుకోవచ్చు కూడా. వికీపీడియా వ్యాసాలను ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడం కొరకు కాపీ హక్కులు మరియు పాఠకుల ప్రశ్నలు చూడండి.

6. వికీపీడియాకు సహకరించడానికి లేదా నమోదు చేయడానికి కనీస వయస్సు అవసరం ఉందా?

ఏ వయస్సు వారైనా వ్యాసాలను సవరించవచ్చు లేదా నమోదు చేయవచ్చు. వికీపీడియా వినియోగదారులు నమోదు చేసుకునేటప్పుడు తమ వయసును వెల్లడించాల్సిన అవసరం కూడా లేదు!

7. నేను తెలుసుకో వలసిన నియమములు, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నావా?

వికీ సమాజం లక్ష్యం, కీలక విధానాలు - వికీపీడియా లో వ్రాయడానికి ముందు మీరు ప్రతీ విధానాన్నీ చదవవలసిన అవసరం లేదు! అయితే, కింద పేర్కొన్న విధానాలు మాత్రం కనీస అవసరాలు. ఎంత త్వరగా వీటి పై పట్టు సాధిస్తే మీ వికీపీడియా అనుభవం అంత బాగుంటుంది.

8. వికీపీడియా రచనల్లో పాటించవలసిన మూడు ప్రాధమిక నియమములు

పైన వ్రాసిన విధానాలు వికీ సమాజం లో పాటించవలసిన పద్దతులు. ఇక పోతే వికీ పీడియాలో వ్రాసే విషయ సంగ్రహం మూడు మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. అంటే ఈ మూడు మౌలిక సూత్రములు సభ్యుల అంగీకారం ద్వారా కూడా మార్చడానికి వీలు లేదు. ఆ మూడు సూత్రములు ఏమంటే


వికీపీడియా ప్రాధమిక అవగాహన అంచనా